వైయ‌స్ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు

తాడేపల్లి: మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌ను సీపీఐ నేతలు కలుసుకున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. హరినాథరెడ్డి వైయ‌స్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీపీఐ నేతలకు వైయ‌స్ జగన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా సంబంధిత అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వైయ‌స్ఆర్‌సీపీని సీపీఐ నేతలు ఆహ్వానించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య వైయ‌స్ జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.

Back to Top