“మేమున్నాం.. ధైర్యంగా ఉండమ్మా ”

 స్వర్గీయ కాకుమాను రాజశేఖర్‌ సతీమణి షర్మిలమ్మకు ఫోన్‌లో పరామర్శించి భరోసా ఇచ్చిన వైయ‌స్‌ జగన్‌

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు స్వర్గీయ కాకుమాను రాజశేఖర్‌ కుటుంబానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. రాజశేఖర్‌ సతీమణి షర్మిలమ్మతో ఫోన్‌లో మాట్లాడిన వైయ‌స్‌ జగన్‌ ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. “మేమున్నాం.. ధైర్యంగా ఉండమ్మా.. పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది” అంటూ భరోసా కల్పించారు. రాజశేఖర్‌ పార్టీ కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుని, ఆయన కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

త్వరలోనే ఒంగోలు వచ్చి కుటుంబ సభ్యులను స్వయంగా కలుసుకుని మాట్లాడతానని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కాకుమాను రాజశేఖర్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
 

Back to Top