ఏలూరు: దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. ఘటనాస్థలికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని పేర్కొన్నారు. దాడిలో గాయపడిన కిరణ్‌ను వైద్యం కోసం తరలించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.