తుఫాను బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

 పెదపెంకిలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

 బలిజిపేట : ఇటీవల తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అండగా నిలిచారు. పెదపెంకి గ్రామంలో తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయి, నష్టపోయిన పేద కుటుంబాలకు గ్రామ నాయకులతో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడం అందరి బాధ్యత అని ఈ సందర్భంగా జోగారావు తెలిపారు. తుఫాను ప్రభావానికి గురైన ప్రతి పేద కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలిచి సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని జోగారావు భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ ద్వారా తక్షణ ఉపశమనం లభించిందని గ్రామ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెదపెంకి గ్రామ ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top