చంద్రబాబు కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లకు శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపు

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి

అలాంటి అభ్యర్థులను వేగంగా గుర్తించండి

ఈ ఎంపికలో మన నిర్ణయాలు రేపు ఎన్నికల్లో ఉపయోగపడాలి

పార్టీలో అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోండి

అవసరమైతే పలు దఫాలుగా వారితో చర్చించండి

ఆ తర్వాతే అభ్యర్థుల జాబితా రూపొందించండి

సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల బలం, అడ్డదారుల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తారని, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని, వీలైనంత వేగంగా ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని నిర్దేశించారు.
పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

అందరి అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక:
    రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలి. వీలైనంత వేగంగా ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాలి. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థుల జాబితా రూపొందించండి. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి. ఎప్పటికప్పుడు స్థానిక నాయకత్వాన్ని పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలి.

అందుకు మీరు సిద్ధంగా ఉండాలి.
అవన్నీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలి:
    రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులతో పాటు, పోలీసుల బలంతో సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తారు. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. అందుకోసం ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలి.
    అలాగే ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలు, మోసాలు, వెన్నుపోట్లను ప్రజలకు గట్టిగా వివరించాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలనూ ప్రస్తావించాలి. వీటన్నింటితో పాటు, చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను సమగ్రంగా చెప్పాలని శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.
    వైయస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, పీవీ మిధున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Back to Top