తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ గుంటూరు సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లిన ఘటనపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన పోలీసులు, ఏ కేసులో, ఏ కారణంతో ఆయనను తీసుకెళ్తున్నారనే వివరాలు వెల్లడించకుండానే అదుపులోకి తీసుకెళ్లారని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ప్రేమ్‌కుమార్‌ను ఎక్కడికి తరలించారు, ఆయనపై ఏ కేసు నమోదు చేశారు, అరెస్ట్‌కు కారణమేంటన్న విషయాలను పోలీసులు స్పష్టంగా వెల్లడించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. చట్టపరమైన ప్రక్రియను పాటిస్తూ కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు సమాచారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.