విశాఖ: విశాఖ నగరంలో తీవ్రంగా నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు జీవీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ‘గుక్కెడు నీళ్ల కోసం ప్రజా గర్జన’ పేరుతో చేపట్టనున్న ఈ ఆందోళనకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. గత కొన్ని రోజులుగా విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా చేయాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. జీవీఎంసీ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాతో ప్రజల నీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.