డీఎస్సీ అక్ర‌మాల‌కు స‌మాధానం చెప్పకుండా ఈ సవాళ్లు దేనికి? 

నారా లోకేష్‌కి వంగ‌వీటి న‌రేంద్ర సూటి ప్ర‌శ్న‌

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి వంగ‌వీటి న‌రేంద్ర 

 లోకేష్‌తో బహిరంగ చ‌ర్చ‌కు వైఎస్సార్సీపీ నాయకులు ఎప్పుడూ సిద్ధమే

 పేర్ని నాని స‌హా ఎంతోమంది ఇప్ప‌టికే బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు

 స‌వాళ్ల పేరుతో జ‌గ‌న్ గారిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు మానుకుంటే మంచిది   

 జ‌గ‌న్ గారితో చ‌ర్చించే స్థాయి నారా లోకేష్‌కి లేదు

 రెడ్‌బుక్‌ రాజకీయాలకు భయపడేది లేదు.. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి

 వ‌ంగ‌వీటి న‌రేంద్ర డిమాండ్ 

 తాడేపల్లి: సకల విధ్వంసాల శాఖ మంత్రి నారా లోకేష్‌ వైఎస్‌ జగన్ గారిపై సవాళ్లు విసరడం మానుకుని, డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ, నిరుద్యోగ యువ‌త‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పార్టీ అధికార ప్ర‌తినిధి వంగ‌వీటి న‌రేంద్ర డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలొ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలపై ఆధారాలతో ప్రజల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని, చిత్తశుద్ధి ఉంటే లోకేష్‌ సీబీఐ విచారణకు సిద్ధపడాలని స‌వాల్ విసిరారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

 స‌వాళ్లు దేనికి?  స‌మాధానం కావాలి

నారా లోకేష్‌ పదేపదే ‘రండి.. ఎక్కడైనా చూసుకుందాం.. టైమ్‌, డేట్‌ చెప్పండి’ అంటూ సవాళ్లు విసరడం కంటే ముందుగా డీఎస్సీపై యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి పేర్ని నాని గారు ఇప్పటికే లోకేష్‌ సవాల్‌ను స్వీకరించారు. అయినా లోకేష్‌ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? డీఎస్సీ పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించామ‌ని భావిస్త, చిత్తశుద్ధి ఉంటే బహిరంగ‌ చర్చకు రావాలి. ఏ త‌ప్పూ చేయ‌న‌ప్పుడు గతంలో మండలి సమావేశాల్లో డీఎస్సీపై ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా ఎందుకు తప్పించుకున్నాడు? డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని మేము ఆధారాలతో ప్రశ్నిస్తున్నాం. నిన్న శాప్‌ కార్యాలయానికి శాంతియుతంగా వెళ్లి బాధిత నిరుద్యోగుల తరఫున రిప్రజెంటేషన్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తే వెన్నుపోటు పార్టీ అనుబంధ సంస్థలకు చెందిన వారితో మాపై దాడులు చేయించారు. ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు మాపైనే ఆరోపణలు చేయడం సరికాదు. దాడి ఎవరు చేశారు? అక్కడ ఏం జరిగింది? అన్న విషయాలపై పూర్తి ఆధారాలను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలి.

 అన్ని ఆధారాల‌తో చ‌ర్చ‌కు మేం సిద్ధం

‘మెగా డీఎస్సీ’ పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు.. అర్హత ఉన్న నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలి. డీఎస్సీపై మాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. పేపర్‌ లీకేజ్‌ నుంచి మెరిట్‌ లిస్ట్‌ వరకు, స్పోర్ట్స్‌ కోటా నుంచి కాల్‌ లెటర్ల వరకు ప్రతి దశలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై నిష్పక్షపాతమైన సీబీఐ విచారణ జరిపించాలి. అందుకే ఇది మెగా డీఎస్సీ కాదు.. నిరుద్యోగ యువత దృష్టిలో దగా డీఎస్సీగా మారిందని మేము చెబుతున్నాం. డీఎస్సీ అక్ర‌మాల‌కు సంబంధించి అన్ని ఆధారాల‌తో మేం సిద్ధంగా ఉన్నాం. నారా లోకేష్‌ ఎక్కడికి రమ్మన్నా బ‌హిరంగ చ‌ర్చ‌కు మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ గారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని సవాళ్లు విసరడం మానుకుని, డీఎస్సీ అక్ర‌మాల‌పై వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పాలి. రెడ్‌బుక్‌ పేరుతో కేసులు, అరెస్టులు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరు. 

 త‌ప్పు చేయ‌న‌ప్పుడు సీబీఐ విచార‌ణంటే భ‌యం దేనికి? 

యువత, శ్రామికులు, రైతులు, విద్యార్థులు, మహిళల సమస్యల కోసం వైఎస్సార్సీపీ ప్రజల తరఫున మరింత బలంగా పోరాడుతుంది. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాం. డీఎస్సీలో ఎవరికి అన్యాయం జరిగింది, ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎవరికి ప్రయోజనం కలిగింది అన్న విషయాలపై సమగ్ర విచారణ జరగాలి. సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. అప్పటి వరకు నారా లోకేష్‌ ఎన్ని సవాళ్లు విసిరినా, ఎన్ని కేసులు పెట్టినా, వైఎస్సార్సీపీ నిరుద్యోగ యువత తరఫున వైఎస్సార్సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన‌ హామీల అమలుపైనా, ఇప్పుడు డీఎస్సీ నియామకాలపైనా ప్రభుత్వం ప్ర‌జలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేష్‌ బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి, సీబీఐ విచారణకు సిద్ధపడాలని వంగ‌వీటి న‌రేంద్ర డిమాండ్ చేశారు.

Back to Top