శాప్ వద్ద మాపై దాడులు చేయించి మళ్లీ మాపైనే కేసులా?

వెన్నుపోటు పార్టీ కూటమి తీరుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

 డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాల్సిందే..

 నిరసనలతో కూటమి సర్కార్‌లో మొదలైన వణుకు.. 

 పోలీసులు తీరు తీవ్ర అభ్యంతరకరం

 పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు

 అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొండి

 లోకేష్‌కు లా అండ్ ఆర్డర్ కల్లాలు ఇస్తే పార్టీ మునగడం ఖాయం

 మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక

తాడేపల్లి:శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైయస్సార్సీపీ నేతలు, విద్యార్థి, యువజన విభాగాల శ్రేణులపై పక్కా ప్రణాళికతో లోకేష్ తన యువగళం రౌడీ మూకలను పోలీసుల సమక్షంలోనే ఉంచి కర్రలు, రాళ్లతో దాడులు చేయించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ  శాప్ కార్యాలయం వద్ద వైయస్సార్సీపీ నిర్వహించిన శాంతియుత ధర్నాతో అధికార పార్టీ నేతల్లో తీవ్ర వణుకు మొదలైందని స్పష్టం చేశారు. 
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం, పైగా బాధితులైన వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 250 మందికి పైగా అక్రమ కేసులు, 307, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు బనాయించి వరుస అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. అధికారం ఎల్లకాలం ఒక్కరి చేతుల్లోనే ఉంటుందనుకోవడం అవివేకమని, సగం కాలం ఇప్పటికే పూర్తయిందని, తదుపరి వైయస్సార్పీ ప్రభుత్వం రాగానే చట్టం పదును చూపిస్తామని ఈ విషయాన్నిసీఎం  చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ గుర్తుంచుకోవాలని అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

- డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణం – సీబీఐ విచారణ ఎందుకు జరపరు?

16 వేల పోస్టుల డీఎస్సీ భర్తీలో సుమారు 400 పైచిలుకు ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేశారు. శాప్ ద్వారా వచ్చిన సర్టిఫికెట్లన్నీ బోగస్, డూప్లికేట్ అని రోజురోజుకూ నిరూపితమవుతోంది. అర్హులైన, న్యాయమైన నిరుద్యోగ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. ఈ కుంభకోణాన్ని బయటపెట్టేందుకే సుదీర్ఘ పోరాటంలో భాగంగా నిన్న శాప్ కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చాం. మేము అడిగిన సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? తప్పు చేయకపోతే విచారణకు ఆదేశించవచ్చు కదా?.

- పోలీసుల సమక్షంలోనే రౌడీ మూకల దాడి..

పోలీసులు అనుమతి నిరాకరించినా విద్యార్థులు, యువతతో కలిసి శాంతియుతంగా నిరసన తెలియజేశాం. కానీ, పోలీసులే శాప్ కార్యాలయంలోని రూముల్లో టీడీపీ రౌడీ మూకలను కూర్చోబెట్టి, మా వారిపై కర్రలతో, రాళ్లతో దాడి చేయించారు. రక్షకభటులే పక్కనుండి రౌడీలతో దాడులు చేయించే సంస్కృతి ఏ రాష్ట్రంలోనైనా ఉందా? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇలాంటి అప్రజాస్వామిక సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. దాడులు చేయడమే కాకుండా పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి మా నాయకులను గాయపరిచారు..

- సంఘటనా స్థలంలో లేనివారిపైనా అక్రమ కేసులు..

పోలీసులు సుమారు 250 మంది వైయస్సార్సీపీ నేతలు, శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారు. విజయవాడ అసలు వెళ్లని వారిపై కూడా 307, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం సిగ్గుచేటు. నాతో పాటు వచ్చిన నూరి ఫాతిమా, డైమండ్ బాబు, అంబటి మురళీకృష్ణ, ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ భర్త గేదెల రమేష్‌లను కాజా టోల్ గేట్ వద్దే అరెస్ట్ చేసి కాకాని స్టేషన్‌కు తరలించారు. కాజా వద్ద ఉన్నవారిని విజయవాడలో పాల్గొన్నట్లు చూపుతూ కేసులు నమోదు చేశారు. వినయ్ కుమార్‌ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి వస్తుంటే మఫ్టీ పోలీసులు నోటీసు పేరుతో బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసులకు బుర్ర లేదా? మఫ్టీలో ఉంటూ కార్ల నుంచి లాక్కెళ్లడం ఏ పోలీస్ మాన్యువల్‌లో ఉంది? మా వద్ద అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి, వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారుల భరతం పడతాం.

- లోకేష్‌కు చట్టం పదును చూపిస్తాం..

గతంలో ఉండవల్లిలో రైతులను పరామర్శించడానికి వెళ్తే మా కార్లు పగలగొట్టి మాపైనే ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టారు. ఎవరినో ఒకరిని తెచ్చి తప్పుడు కేసులు పెట్టించడం వీరికి అలవాటుగా మారింది. అధికారం శాశ్వతమని లోకేష్ భ్రమపడుతున్నారు. ఇప్పటికే 50 శాతం కాలం అయిపోయింది. మిగిలిన 50 శాతం ముగిసిన తర్వాత చట్టం అంటే ఏంటో, దాని పదును ఎంత ఉంటుందో లోకేష్‌కు, ఆయన తండ్రికి కచ్చితంగా చూపిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా డీఎస్సీ స్కామ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

- చంద్రబాబుకు హెచ్చరిక – లా అండ్ ఆర్డర్ కల్లాలు లోకేష్ చేతికి ఇవ్వొద్దు.

చంద్రబాబు నాయుడు గారూ.. మీ అబ్బాయికి డబ్బులు వసూలు చేసుకునే కల్లాలు, సంచులు మోసే పనులు అప్పగించుకోవచ్చి.. అందుకు మాకేం అభ్యంతరం లేదన్న అంబటి రాంబాబు  శాంతిభద్రతల కల్లాలు మాత్రం లోకేష్ చేతికి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి కల్లాలు ఇస్ వెన్నుపోటు పార్టీని, మిమ్మల్ని ముంచేయడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తాడని హెచ్చరించారు. మరోవైపు నారా లోకేష్ జోలికి వస్తే చంపేస్తామంటూ కొందరు రౌడీలు మాట్లాడ్డంపై తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారం నెత్తికెక్కినప్పుడు ఇలాగే ఉంటుందన్న అంబటి... ఎన్ని కుట్రలు పన్నినా, డీఎస్సీ బాధితుల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Back to Top