ఆరోగ్యశ్రీతో తమ కుమార్తెకు ప్రాణదానం

వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చిన్నారి ధన్సిక కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించిన వైయ‌స్‌ జగన్‌

 విజయవాడ : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్‌, వినీల దంపతులు తమ కుమార్తె ధన్సికతో కలిసి కలిశారు. 2019లో వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే, తమ కుమార్తె ధన్సిక రెండు నెలల పాపగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైందని వారు తెలిపారు. ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీ ఉచితంగా జరిగిందని, ఆ చికిత్సతో తమ కుమార్తె కోలుకుందని వివరించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా పెరుగుతోందని, తమ కుటుంబానికి అందిన ఈ సహాయాన్ని జీవితాంతం మరిచిపోలేమని చెబుతూ వైయ‌స్‌ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను వైయ‌స్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారికి సూచించి ఆశీర్వదించారు. చిన్నారి, ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారితో కలిసి సెల్ఫీ దిగారు. వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుమార్తెకు అందిన వైద్య సహాయం తమ కుటుంబానికి ఎంతో మేలు చేసిందని మహేష్‌, వినీల దంపతులు తెలిపారు. తమ కుమార్తెకు అందిన చికిత్సను, తమ కుటుంబానికి జరిగిన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు.

Back to Top