కడపలో కత్తులు, కర్రలతో టీడీపీ శ్రేణుల హల్‌చల్

మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్‌పై కత్తితో దాడి.. గాంధీనగర్ స్కూల్ వద్ద ఉద్రిక్తత

కడప: కడపలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్‌పై కత్తితో దాడి జరిగినట్లు సమాచారం. టీడీపీకి చెందిన వ్యక్తులు కత్తులతో హల్‌చల్ చేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గాంధీనగర్ పాఠశాల వద్ద టీడీపీ శ్రేణులు కత్తులు, కర్రలు, రాళ్లతో తిరుగుతూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల కోసం సందులు, గొందుల్లో వెతుకుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత‌ల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు ర‌వీంద్రానాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ నేత‌లు రోడ్డుపై బైఠాయించి ధ‌ర్నా చేప‌ట్టారు.

స్థానికంగా చోటుచేసుకున్న ఈ ఘటనలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని, పార్టీ కార్యాలయాలు, నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను పెంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

Back to Top