రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చింతపల్లి నాగేశ్వరరావు నామినేషన్

గత ప్రభుత్వ అభివృద్ధే బలం.. ప్రజల మద్దతుతో వైయ‌స్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందన్న నేతలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ స్థానానికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా చింతపల్లి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్‌గా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేశానని నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ శ్రేణులు నిర్వహించిన గడపగడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం తనకు ప్రజల్లో మరింత ఆదరణ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారని, రామచంద్రపురంలో వైయ‌స్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, రామచంద్రపురం మున్సిపాలిటీని మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబం కలెక్షన్ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఎన్నికలను కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో గడపగడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రామచంద్రపురం మున్సిపల్ స్థానాన్ని వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Back to Top