విజయవాడ సెంట్రల్ 83వ డివిజన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచారం

గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటా కరపత్రాల పంపిణీ

విజయవాడ: విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశాల మేరకు 83వ డివిజన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డివిజన్ అభ్యర్థి తేలుకుట్ల దేవి, డివిజన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

Back to Top