విజయనగరం అభివృద్ధికి యువత రాజకీయాల్లోకి రావాలి

ప్రజాసేవకు అవకాశం కల్పించండి.. కోలగట్ల శ్రావణి

విజయనగరం: నగర అభివృద్ధికి యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని వైయ‌స్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి ఆకాంక్షించారు. శనివారం విజయనగరంలోని 3వ డివిజన్ పూల్‌బాగ్ కాలనీ, 23వ డివిజన్ జమ్ము పరిసర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో యువత ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అడుగుజాడల్లో నడుస్తూ విజయనగరం అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రజలు తనకు అవకాశం కల్పించాలని కోరారు.

రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోలగట్ల శ్రావణి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో 3వ డివిజన్ వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బండారు ఆనంద్, 23వ డివిజన్ అభ్యర్థి పొదిలాపు భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top