ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన మంచిని ప్రతి గడపకూ వెళ్లి వివరించారు. ఎంపీటీసీ అభ్యర్థి గుళ్యం శ్రావణి, జెడ్పీటీసీ అభ్యర్థి గుళ్యం బసవరాజును గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే విరుపాక్షి ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.