కర్నూలు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు

రాళ్లు, వేటకొడవళ్లతో దాడి.. ఎంపీటీసీ అభ్యర్థి బోయ సరస్వతమ్మకు గాయాలు

కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. కర్నూలు మండలం తొలిసాపురం ఎంపీటీసీ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బోయ సరస్వతమ్మపై ప్రచారానికి వెళ్లిన సమయంలో రాళ్లు, వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అభ్యర్థితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు.

ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులపై దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Back to Top