కూటమితో జత కట్టి పోలీసు, ఎస్ఈసీ వ్యవస్థలు స్థానిక ఎన్నికల్లో పోటీ

కూటమి కార్యకర్తల్లా కొందరు అధికారులు బెదిరింపులు, దౌర్జన్యాలు

వైయ‌స్సార్ సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు

రాజమహేంద్రవరంలో జిల్లా వైయ‌స్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్

పులివెందులలో అక్రమాలు జరిగాయని తప్పుడు పోస్టులు పెట్టిన లోకేశ్, వెన్నుపోటు పార్టీ  దౌర్జన్యాలపై మాట్లాడరేం

వెన్నుపోటు పార్టీ గూండాలు రాళ్లు, కర్రలతో మహిళలు, జర్నలిస్టులపై చేసిన దాడులు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే

మార్గాని భరత్ ఆక్షేపణ

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు వెన్నుపోటు పార్టీ కూటమి అరాచకాలకు వేదికగా మారాయని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. స్థానికల్లో కూటమి పార్టీలు మాత్రమే కాకుండా పోలీసు వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ కూడా జత కట్టి పోటీ చేస్తున్నట్లు వ్యవహరించాయని,  ఆయా వ్యవస్థల అధికారులు కూడా కూటమి కార్యకర్తల తరహాలో పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీకి చెందిన  గూండాలు రాళ్లు, కర్రలు, పిడిగుద్దులతో దాడులు చేస్తూ మహిళలను,  జర్నలిస్టులను సైతం విధులు నిర్వహించకుండా విరుచుకుపడటం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని స్పష్టం చేశారు. పులివెందులలో ఎన్నికల అక్రమాలు జరిగాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న నారా లోకేష్.. అక్కడ వెన్నుపోటు నేతలు చేసిన దౌర్జన్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు? అని మార్గాని భరత్ ప్రశ్నించారు.  రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల వార్డు రిజర్వేషన్ల విషయంలో అధికారికంగా ప్రకటించకముందే  వాట్సాప్ గ్రూపుల్లో ఎలా వచ్చాయి? అని నిలదీశారు.

Back to Top