ప్రొద్దుటూరు: వైయస్ఆర్సీపీ తరఫున ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల నమ్మకంతో, ప్రొద్దుటూరు ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన, పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ప్రజలపై నమ్మకంతో నామినేషన్ దాఖలు చేశానని, వారి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే తన సంకల్పమని పేర్కొన్నారు. ప్రజల ఆదరణే తన బలమని, ప్రజాసేవే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “ముందు వింటాం.. తర్వాత చేస్తాం” అనే నినాదంతో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మన ప్రొద్దుటూరు, మన అభివృద్ధి, మన బాధ్యత అనే ఆశయంతో ప్రజల భాగస్వామ్యంతో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.