తాడేపల్లి: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంగూడెంకు చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త కె. నాగబాబు తన కుమార్తె సహర్షితకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారి జీవితంలో తొలి అక్షరాలకు శ్రీకారం చుట్టే ఈ శుభకార్యాన్ని వైయస్ జగన్ చేతుల మీదుగా నిర్వహించడం నాగబాబు కుటుంబంలో ఆనందాన్ని నింపింది. తమ కుమార్తె సహర్షితకు అక్షరాభ్యాసం చేయించే అవకాశం వైయస్ జగన్ చేతుల మీదుగా లభించడం ఎంతో సంతోషంగా, జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని నాగబాబు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి విద్యాభ్యాసం విజయవంతంగా సాగాలని, ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారి సహర్షితను వైయస్ జగన్ ఆశీర్వదించి, ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ మధురమైన సందర్భాన్ని ఆనందంగా పంచుకున్నారు.