రేపు గవర్నర్‌ను కలవనున్న వైయస్‌ జగన్‌

 శాప్‌ కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడి ఘటనపై ఫిర్యాదు

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు బుధవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై నిరసన సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించింది.

అలాగే డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంటున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైయస్‌ జగన్‌ గవర్నర్‌ను కోరనున్నారు. సెప్టెంబర్‌ 21న శాప్‌ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  

Back to Top