'నేను నా కరుణామయుడు' పుస్తకావిష్కరణ

హైదరాబాద్:

ప్రముఖ నటుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన విజయచందర్ శుక్రవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను కలిశారు. కరుణామయుడు చిత్రాన్ని నిర్మించి 34 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తను రాసిన 'నేను.. నా కరుణామయుడు' పుస్తకాన్ని ఆయన విజయమ్మ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. తొలి ప్రతిని ఆమెకు బహుకరించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికీ, సోదరి శ్రీమతి వైయస్ షర్మిలకూ కూడా పుస్తకాలను ఇస్తానని విజయచందర్ విలేకరులకు తెలిపారు.

Back to Top