మహానేత వైయస్‌ ఆశయాలు జగన్‌తోనే సాధ్యం

పెడన‌ (కృష్ణాజిల్లా) : దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీన‌ర్ నల్లా సూర్యప్రకా‌శ్ అన్నారు. ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ పెడన మండలం బల్లిపర్రులోని వివిఆర్ ఎస్టే‌ట్‌లో పార్టీ నేతలతో కలసి ఆయన ఆదివారం సంతకాల సేకరణలో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వివిఆర్ శిబిరం ఏర్పాటు చేసి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. తొలుత ఎస్టే‌ట్‌లోని వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి నల్లా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.‌

ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ‌, మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వైయస్ ఇచ్చిన గ్యా‌స్ సబ్సిడీలో ‌టిడిపి అధ్యక్షుడు  చంద్రబాబుకు కూడా లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐను అడ్డుపెట్టుకుని కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. నిజానిజాలను స్వతంత్రంగా నిర్ధారించాల్సిన సిబిఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రెండు వందల రోజులకుపైగా అక్రమంగా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని పార్టీ జిల్లా నాయకులు పలువురు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, ‌సిబిఐ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Back to Top