కొన‌సాగుతున్న కక్ష సాధింపు చ‌ర్య‌లు

తాడిప‌త్రిలో వైయస్ఆర్‌సీపీ నేత ఇంటి నిర్మాణం అడ్డ‌గింత‌
 

అనంతపురం:  రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్‌సీపీ నేతలను కూటమి నేతలు, అధికారులు టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.  తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్‌ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 

 

Back to Top