ఓర్లాండో, ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైయస్ఆర్‌సీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు, వైయస్‌ఆర్ అభిమానులు, వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులు పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైయస్‌ఆర్ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించిన వైయస్ జగన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైయస్ఆర్‌సీపీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు వైయస్‌ఆర్ ప్రభుత్వం అందించిన అండను వివరించారు. వైయస్‌ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రులు వైయస్ఆర్‌సీపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్ సంక్షేమ వారసత్వాన్ని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో కొనసాగించారని, మరోసారి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వైయస్‌ఆర్ వైయస్ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ రత్నాకర్ పాండుగాయల మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ విశ్వసనీయత, నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా వైయస్‌ఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైయస్‌ఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తు చేశారు. తండ్రిని మించిన తనయుడిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే తమ అందరి ఏకైక లక్ష్యమని తెలిపారు. పేదలకు వైద్యం అందించిన మహానేత డా. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ వైద్య రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో వైయస్‌ఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఆర్థిక స్థోమత లేని అనేక కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు డా. కొండ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచే అనేక కార్యక్రమాలను వైయస్‌ఆర్ అమలు చేశారని తెలిపారు. ఆ పథకాల ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులను అనేక కుటుంబాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రవాసాంధ్రుల అనుభవాల్లో వైయస్‌ఆర్ సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రవాసాంధ్రులు వైయస్‌ఆర్ హయాంలో తమ కుటుంబాలకు లభించిన ప్రయోజనాలను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ తదితర సంక్షేమ పథకాల ద్వారా వ్యక్తిగతంగా పొందిన ప్రయోజనాలను వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా వైయస్‌ఆర్ సేవలను స్మరించుకున్నారు. వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఓర్లాండోలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాసాంధ్రుల్లో మహానేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటిచెప్పింది. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాసేవకు వైయస్‌ఆర్ ఇచ్చిన ప్రాధాన్యతను స్మరించుకుంటూ.. ఆయన ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యక్తం చేశారు. తెలుగు నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా మహానేత వైయస్‌ఆర్ సేవా స్ఫూర్తి తమ హృదయాల్లో సజీవంగానే ఉందని తెలిపారు. భారీగా పాల్గొన్న ఎన్‌ఆర్‌ఐలు కార్యక్రమంలో రత్నాకర్ పాండుగాయల, డా. కొండ మోహన్‌రెడ్డి, డా. వాసుదేవరెడ్డి, జలందర్, రాయల్‌రెడ్డి, రాజశేఖర్, రవి, సంజీవ, రఘు, జనార్దన్, సునీల్, వెంకట్ పులి, శేషాద్రి, సురేంద్ర, మధు, కిరణ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు, వైయస్‌ఆర్ అభిమానులు, వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులు హాజరై మహానేతకు నివాళులర్పించారు.