విశాఖను విశ్వనగరం నుంచి వినాశనగరంగా మార్చేశారు

  కూటమి పాలనలో ప్రచారం పీక్స్‌.. గ్రౌండ్‌ రియాలిటీ వీక్‌
 
 ప్రజలకు తాగునీరు లేదు.. పరిశ్రమలకు నీరు లేదు.. సాగునీరు లేదు

 వందల కోట్ల విలువైన భూములను 99 పైసలకే కట్టబెడుతున్న తీరు దారుణం

  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ధ్వజం

విశాఖపట్నం : విశాఖనగరాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విధ్వంసం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, వైఎస్ జగన్ పాలనలో ‘విశ్వనగరం’గా ఎదిగిన విశాఖను నేడు ‘వినాశ నగరం’గా మార్చేశారని మండిపడ్డారు. నగరంలో సుమారు 20 లక్షల మంది ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం బిందెలతో రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే, ప్రభుత్వం కనీస పరిష్కారం చూపడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. విశాఖ దాహం తీర్చలేని సీఎం చంద్రబాబు తనను తాను ‘వాటర్ మ్యాన్’ అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని, ఆయన వాటర్ మ్యాన్ కాదు.. మోసాల మ్యాన్, వెన్నుపోటు మ్యాన్ అని ఎద్దేవా చేశారు. పిల్లాడికి చాక్లెట్ కూడా రాని 99 పైసలకే వేల కోట్ల విలువైన విశాఖ భూములను తమ వారికి ధారాదత్తం చేస్తూ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎంపీ, మంత్రులకు నగర భూములు, బీచ్ షాక్స్‌పై ఉన్న శ్రద్ధ.. తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రజల సమస్యలపై లేదని, నీటిని కూడా వ్యాపారంగా మార్చి నీటి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

విశ్వనగరాన్ని వినాశ నగరంగా మార్చేశారు!

గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దితే, నేడు కూటమి పాలకులు విధ్వంసం సృష్టిస్తూ వినాశ నగరంగా మార్చేశారు. కూటమి పాలన విజన్‌తో కూడినది కాదు, ఆంధ్రప్రదేశ్‌కు ఇదొక విషం లాంటి పాలన. పిల్లాడికి చాక్లెట్ కూడా రాని 99 పైసలకే వందల, వేల కోట్ల విలువైన విశాఖ భూములను కార్పొరేట్లకు ఎలా ధారాదత్తం చేస్తారు?. విశాఖ బ్రాండ్ వాల్యూని, ప్రభుత్వ ఆస్తులను ఇంత దారుణంగా దిగజార్చి తమ వారికి కట్టబెట్టడమేనా మీ నయా పాలన?.

వాటర్ మ్యాన్ కాదు.. పెద్ద వెన్నుపోటు మ్యాన్!.

పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీతో నీళ్లు రాకుండా.. పాత పురుషోత్తపట్నం పంపులతో నీళ్లను తోడి విశాఖకు నీళ్లిచ్చేశామని అబద్ధాలు చెప్తారా?.
చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు, పెద్ద వెన్నుపోటు మ్యాన్.. అబద్ధాలు, మోసాల మ్యాన్! సొంత డబ్బా కొట్టుకుంటూ భజన చేయించుకుంటున్నారు. కూటమి పాలనలో ప్రచారం పీక్స్‌లో ఉంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు అత్యంత వీక్‌గా ఉన్నాయి. విశాఖలో చుక్క నీరు దొరకని దుస్థితి నెలకొంది అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫలమైంది!. నగరంలో కుళాయిలు రాక, ట్యాంకర్ల కోసం మహిళలు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే విశాఖకు నీళ్లిచ్చామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా?. ప్రజలకు తాగునీరు లేదు, రైతులకు సాగునీరు లేదు, స్టీల్ ప్లాంట్ సహా పరిశ్రమలకు నీరు లేదు.. ఇంత ఘోరమైన నీటి కష్టాలు విశాఖ చరిత్రలో ఎప్పుడైనా చూశామా?. నగరంలో 20 లక్షల మంది ప్రజలకు తీవ్ర నీటి కొరత వస్తుందని తెలిసి కూడా జీవీఎంసీ అధికారులు, బ్యూరోక్రాట్లు నిద్రపోతున్నారా.. మీ ముందస్తు ప్రణాళిక ఏమైంది?. మాట్లాడిజే విజన్ 2047 అని చెబుతున్న సీఎం చంద్రబాబుది విజన్ పాలన కాదు ముమ్మాటికీ పాయిజన్ పాలనే. 

నీటి మాఫియాతో మూటలు సర్దుకుంటున్నారు!

నగరంలో మట్టి మాఫియాతో పాటు ఇప్పుడు కొత్తగా నీటి మాఫియా తయారైంది; డబ్బులు కట్టినా ప్రజలకు ట్యాంకర్ నీళ్లు దక్కడం లేదు. ప్రజల దాహాన్ని కూడా వ్యాపారంగా మార్చి, నీళ్లతో మూటలు సర్దుకునే నీచ సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసింది. ఇంత దారుణంగా ఉన్నా స్ధానిక ఎంపీతో సహా వెన్నుపోటు కూటమి పార్టీ నేతలకు ప్రజల గోడు పట్టడం లేదు. పెత్తందార్లకే పెద్దపీట వేస్తున్నారు. విశాఖ ఎంపీకి ప్రజల దాహార్తి, కన్నీళ్లు పట్టవు.. ఆయనకు కావాల్సిందల్లా బీచ్ షాక్స్, ఆయన అనుచరులకు కావాల్సింది భూములు మాత్రమే!.  పంచభూతాలైన గాలి, నీరు, భూమిని సైతం కలుషితం చేసి ప్రజలను నరకకూపంలోకి నెట్టేశారు.

ఆపరేషన్ లంగ్స్ పేరుతో పేదలపై ప్రతాపం!..

పోర్టు కాలుష్యాన్ని, బడా పారిశ్రామికవేత్తలను కట్టడి చేసే దమ్ము లేక.. ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఫుట్‌పాత్ వ్యాపారులు, తోపుడు బండ్ల పేదలపై అధికార దర్పం చూపుతారా?. డేటా సెంటర్ల పేరుతో ముడసర్లోవలో 166 ఎకరాల కొండను కొల్లగొట్టి పర్యావరణ సమతుల్యతను, జలాశయాల ఉనికిని దెబ్బతీశారు. 
ప్రజలే రక్తకన్నీరు పెడుతున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ కార్పొరేషన్ అభ్యర్ధులను బలిపశువులు చేస్తున్నారంటున్న కూటమి నేతల్లారా.. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు విశాఖ ప్రజలే నేడు బలిపశువులై రక్తకన్నీరు పెట్టుకుంటున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. కేవలం కూటమి పాలకుల వల్లే విశాఖ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. స్ధానిక ఎంపీకి, ఆయన తోడల్లుడు మంత్రి లోకేష్ కి విశాఖను దోచుకోవడంపై తప్ప ఇక్కడ సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు.   

ఈ నేపధ్యంలో ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాలు, రాజకీయ కక్షసాధింపులు పక్కనపెట్టి విశాఖపట్నంలో యుద్ధప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించాలని కొండా రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ మహా ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. మరోవైపు రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలిపిస్తే తప్ప... వెన్నుపోటు పార్టీకి బుద్ది రాదన్న కొండా రాజీవ్, అప్పుడే విశాఖ నగర ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.

Back to Top