నిజమైన కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం

మాజీ ఎమ్మెల్యే  కొరముట్ల శ్రీనివాసులు

 రైల్వే కోడూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరవేస్తామని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కోడూరు మండల విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలు, నాయకులకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు పార్టీకి ఉందని కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా, సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాలను స్వీకరించి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
 

Back to Top