తాడేపల్లి: రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై అణచివేత, వివక్ష పెరిగిపోయాయని వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాకవి గుర్రం జాషువా, విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇరువురు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ జగన్ గారి పాలనలో పేద, అణగారిన వర్గాలకు విద్య, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యం, సామాజిక గౌరవం, రక్షణకు ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు పాలనలో అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. జాషువా, భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. జగన్ గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన సమాజంలో కులాంతరాలు, అంటరానితనం, వివక్షను రూపుమాపేందుకు మహాకవి గుర్రం జాషువా తన సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నారని నేతలు కొనియాడారు. నాటి కాలంలో అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఆయన రాసిన ప్రతి కవిత సమాజానికి కనువిప్పు కలిగించిందని గుర్తుచేశారు. అలాగే, దేశ స్వాతంత్ర్యం కోసం తన 23వ ఏటనే ప్రాణాలను తృణప్రాయంగా వదిలి, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ త్యాగాలు నేటి యువతకు ఎప్పటికీ ఆదర్శమని పేర్కొన్నారు. విద్య, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం గతంలో పలు కార్యక్రమాలు చేపట్టిందని వారు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనంతరం వైఎస్ జగన్ గారు అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు. కానీ, నేడు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనలో మళ్లీ అంటరానితనం, దళితులు, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలపై అణచివేతలు ఎక్కువయ్యాయని నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని.. మహిళలు, అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన వస్తుందని, అప్పుడే జాషువా, భగత్ సింగ్ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్టీ సెల్(మైదాన ప్రాంతం) అధ్యక్షుడు గుండా సురేంద్ర, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.