కర్నూలు జిల్లా : మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామంలో వైయస్ఆర్‌సీపీ పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, యువ నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి, వై.ధరణిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల ఇన్‌చార్జి మురళీమోహన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తింపు కార్డు కేవలం ఒక కార్డు కాదని, వైయస్ఆర్ కుటుంబంలో కార్యకర్తకు ఉన్న గుర్తింపుకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ పట్ల బాధ్యత ఉందని, కష్టకాలంలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని, గ్రామంలోని ప్రతి ఇంటికీ వైఎస్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి : మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని మండలం సలకలకొండ గ్రామ సమీపంలోని పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి పంటల పరిస్థితి, సాగు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించిన బీమా ప్రీమియానికి సంబంధించిన పరిహారాన్ని తక్షణమే అందించాలని కోరారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి పంట నష్టంపై సమగ్రంగా అంచనా వేసి తగిన పరిహారం అందించాలని తెలిపారు.