దెందులూరు: నున్న సీఐ శ్రీ షేక్ అహ్మద్ అలీ మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని ఆయన స్వగ్రామానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం షేక్ అహ్మద్ అలీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.