తాడేపల్లి: దేశం కోసం జీవించడం అంటే ఏమిటో, మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఎంత గొప్పదో తన జీవితంతో చాటిన అమరవీరుడు భగత్‌సింగ్ అని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకమని తెలిపారు. అమరవీరుడు భగత్‌సింగ్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, చూపిన ధైర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.