ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెంలో పార్టీ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వాహనాన్ని పెదవేగి మండలం వేగివాడ వద్ద టీడీపీ వర్గాలు అడ్డుకుని దాడికి యత్నించాయని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. అబ్బయ్య చౌదరి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసరడంతో కారు అద్దం ధ్వంసమైందని తెలిపారు. ఈ ఘటనపై వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లేరు లీజుల పేరుతో టీడీపీ నేతలు రాజకీయ వివాదాలకు తెరతీస్తున్నారని, వంటావార్పుల పేరుతో నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడికి యత్నించడం రాజకీయ కక్షసాధింపులకు నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి.