కర్నూలు సబ్‌జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ములాఖత్‌

  55 రోజులుగా నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యేను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పార్టీ నేతలు

 కర్నూలు : కర్నూలు సబ్‌జైల్లో 55 రోజులుగా నిర్బంధంలో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ములాఖత్‌ అయ్యారు. గుంతకల్ మాజీ శాసనసభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ గుంతకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వై. వెంకటరామిరెడ్డి, హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్‌, రాష్ట్ర మాజీ మైనింగ్ డైరెక్టర్ పులివెందుల వీర ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర మాజీ వీరశైవ కార్పొరేషన్ డైరెక్టర్ పాటిల్ యుగంధర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు తిక్కస్వామి తదితరులు సబ్‌జైలుకు వెళ్లారు.

ఈ సందర్భంగా నేతలు ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
 

Back to Top