విజయనగరం: బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో వైయస్ఆర్‌సీపీ సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు యమల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తోటపల్లి రిజర్వాయర్‌తో లక్షల ఎకరాలకు సాగునీరు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటలు పండుతున్నాయంటే తోటపల్లి రిజర్వాయర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో బొత్స సత్యనారాయణ సహకారంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా సుమారు 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రజలను భయపెట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయి పార్టీ కమిటీలకు నియమితులైన నాయకులు, సభ్యులకు బొత్స సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొత్స కాసినాయుడు, అంబళ్ల శ్రీరాముల నాయుడు, డాక్టర్ బొత్స సందీప్, మత్స సత్యనారాయణ, బోగి గౌరీ, పెద్దింటి రామారావు, సావు వెంకట మురళీకృష్ణ, శంబంగి వేణుగోపాల్ నాయుడు, బొద్దల సత్యనారాయణ, తెంటు మధుసూదన్‌రావు, బొమ్మినాయిని రమేష్ నాయుడు, బేతనపల్లి శంకరరావు, అవు సత్యనారాయణరావు, వంగపండు జోగినాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.