సుప్రీంకోర్టు సాక్షిగా బీసీలను మోసం చేసిన చంద్రబాబు.. మిస్టర్‌ 420

సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ నుంచి 34 శాతం బీసీ రిజర్వేషన్ల వరకు అన్నీ మోసపూరిత హామీలే

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్‌ జగన్ ఫైర్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్స్  వేదిక‌గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు మిస్టర్‌ 420 అని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించి వంచించిన విషయం సుప్రీంకోర్టు పరిణామాలతో మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు.  చంద్రబాబు ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
చంద్ర‌బాబు గారూ.. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో మీరు మిస్టర్‌ 420. 
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజ‌ర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధార‌ణ అయింది.  మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది.

చంద్రబాబు గారూ.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం.
గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దుచేయడం మరొక మోసం.
విద్యాదీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం.
143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం.
చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టూ మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే.

చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి. 
 

Back to Top