కూటమి ప్రభుత్వం  అన్ని రంగాల్లో విఫ‌లం

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 1వ డివిజన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘గడప గడపకు వైయ‌స్ఆర్‌సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నాయకులు పాల్గొని స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

శ్నింమున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయనే పెన్షన్లపై ప్రభుత్వం డ్రామాలు మొదలుపెట్టిందని మల్లాది విష్ణు విమర్శించారు. కొత్త పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేకపోయారని ప్రచారు. పెన్షన్ల వ్యవస్థను సరళీకరిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని ప్రశ్నించారు.

ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రానికి నివేదిక ఎందుకు ఇవ్వలేదని మల్లాది విష్ణు నిలదీశారు. కర్ణాటకలో కేంద్ర కరువు బృందాలు పర్యటిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వైద్యం కోసం ప్రజలు ఎల్‌ఓసీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, వాటి వాస్తవ వివరాలను వెల్లడిస్తూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ధైర్యంగా కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన తెలిపారు.

Back to Top