కనిగిరి: నవయుగ కవి చక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను కనిగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వద్ద ఉన్న జాషువా విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా మలుచుకుని అసమానతలు, అంటరానితనం, వివక్షపై తన కలంతో పోరాడిన మహాకవి జాషువా అని కొనియాడారు. సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలపై తన పద్యాల ద్వారా గళమెత్తిన జాషువా తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారని నాయకులు పేర్కొన్నారు. మానవత్వం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాషువాకు నివాళులర్పించారు.