వైయ‌స్ఆర్‌సీపీని గెలిపిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది

మాజీ మంత్రి వెలంపల్లి

విజయవాడ పశ్చిమలో విస్తృత ఎన్నికల ప్రచారం.. రాయన భాగ్యలక్ష్మి, యరడ్ల ఆంజనేయరెడ్డిని గెలిపించాలని పిలుపు

విజయవాడ:విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 34వ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. స్వాతి థియేటర్‌ వద్ద ప్రారంభమైన ప్రచారం గుడివాడ రామారావు వీధి, హనుమాన్‌ వీధి, బ్యాంక్‌ సెంటర్‌, చర్చి రోడ్‌, కోళ్లఫారం రోడ్‌, గాంధీ బొమ్మ రోడ్‌, ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్‌ మీదుగా సాగింది. ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా, నగర మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, 34వ డివిజన్‌ అభ్యర్థి యరడ్ల ఆంజనేయరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వెలంపల్లి కోరారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, నామినేషన్లను అడ్డుకోవడం, పత్రాలు చింపేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నాయని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ గెలుపుతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని పేర్కొన్నారు.

34వ డివిజన్‌లో యరడ్ల ఆంజనేయరెడ్డి గత ఐదేళ్లలో రోడ్లు, తాగునీటి ట్యాంకులు సహా పలు మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉన్నారని వెలంపల్లి తెలిపారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పెన్షన్లు, చేయూత, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. CFMS పేరుతో నగరపాలక సంస్థ ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ గెలిస్తే స్థానిక పన్నుల ఆదాయాన్ని నగర అభివృద్ధికే వినియోగించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అమరావతి పేరుతో విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించిన వెలంపల్లి, వైయస్‌ జగన్‌ నాయకత్వంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి రాయన భాగ్యలక్ష్మి, యరడ్ల ఆంజనేయరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

Back to Top