కృష్ణా జిల్లా: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం జోన్-3 అధ్యక్షురాలు మైలా రత్నకుమారి మండిపడ్డారు. స్థానిక ఎన్నికల వేళ మరోసారి షర్మిల ప్రస్తావనను తెరపైకి తెచ్చి జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని పేర్కొంటూ, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను ఎండగడుతూ ఆమె వీడియో విడుదల చేశారు. - ప్రత్యర్థిని ఎదుర్కోలేక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు “ప్రత్యర్థి బలవంతుడైనప్పుడే లేనిపోని ఆరోపణలు చేస్తూ, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి గారు బలమైన నాయకుడు కాబట్టి, రాష్ట్రంలో ఆయనకు ప్రజాదరణ పుష్కలంగా ఉంది కాబట్టి, ఆయనను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక 2024 ఎన్నికల సమయంలోనూ చెల్లి ప్రస్తావన తీసుకొచ్చి, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికలు రాగానే షర్మిల గారి కూతురు వివాహాన్ని తెరపైకి తీసుకొస్తూ జగన్మోహన్రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. 2024లో మీ ప్రచారం చెల్లుబాటు అయిందేమో గానీ, ఈ రెండున్నరేళ్లలో మీరు ఏమిటి, మీ అబద్ధాలు ఏమిటి, మీ విధానాలు ఏమిటో ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి, చంద్రబాబు నాయుడు గారూ! జగనన్నకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంది. స్థానిక ఎన్నికల్లో మీరు చేస్తున్న ప్రలోభాలు, బెదిరింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్న మీ పాలనా విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్మోహన్రెడ్డి గారి చెల్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర స్థాయిలోనూ, జాతీయ మీడియా కూడా గమనిస్తోంది. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా తిప్పికొడతారు. మీ అబద్ధపు ప్రచారాలు ఇక చెల్లవు, చంద్రబాబు నాయుడు గారూ. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.”