శ్రీకాకుళం జిల్లా: ఆమదాలవలస నియోజకవర్గంలోని నిమ్మతొర్లాడ పంచాయతీలో టీడీపీకి చెందిన 19 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపింది. స్థానికంగా వైయస్ఆర్‌సీపీ బలోపేతానికి ఈ చేరికలు దోహదపడనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలను కలుస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.