స్థానిక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొందాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం

ప్రతి గ్రామం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయాలి: వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వై.వి. సుబ్బారెడ్డి

పిడుగురాళ్ల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించాలని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వై.వి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గురజాల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం, పల్నాడు జిల్లా మున్సిపల్‌ రివ్యూ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని తెలిపారు.

గత ఐదేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నంబూరు శంకరరావు సూచించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ స్థానిక ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వై.వి. సుబ్బారెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top