తాడేపల్లి : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్‌లో శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం పోలీసులతో పాశవిక అణచివేతకు పాల్పడటమే కాకుండా, చంద్రబాబు డైరెక్షన్‌లో నడిచే ఎల్లో మీడియా—ముఖ్యంగా టీవీ5 ఛానల్ ఉద్యోగులను ‘గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, పోరంబోకులు’ అంటూ అత్యంత జుగుప్సాకరమైన భాషతో అవమానించడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జర్నలిజం ముసుగులో బ్రోకరిజం నడుపుతున్న టీవీ5 సాంబడు, ఆ ఛానల్ యాజమాన్యం, కూటమి ప్రభుత్వం తక్షణమే లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్య వ్యాఖ్యలు చేసిన సాంబశివరావుపై ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. మహిళా ఉద్యోగులపై అమానుష నిర్బంధం – సభ్యసమాజం తలదించుకునే తీరు సెలవు రోజైన ఆదివారం నాడు శాంతియుతంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు ఉద్యోగులు విజయవాడకు వస్తుంటే... ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్‌గేట్ల వద్ద అడ్డుకుని క్రిమినల్ కేసులు పెడతామని, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం నిరంకుశత్వానికి పరాకాష్ట. చంటిపిల్లలను ఇళ్ల వద్ద వదిలి వచ్చిన మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా పోలీసులు రోడ్లపై ఈడ్చిపారేయడం, విచక్షణారహితంగా బస్సుల్లో కుక్కి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. అసలు వీరి సమస్యలపై కూర్చుని చర్చలు జరపాలనే కనీస స్పృహ, ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి, అధికారులకు లేకుండా పోయింది. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం: అసలైన పోరంబోకులు మీరే!.. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే ఉద్యోగులను పట్టుకుని టీవీ5 సాంబశివరావు అనే వ్యక్తి కోట్లు, సూట్లు వేసుకుని కూర్చుని ‘గంజాయి సేవించారా, పోరంబోకులా, రౌడీషీటర్లా’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? పోరంబోకులు ఎవరు? నువ్వు పోరంబోకువి! నువ్వు నాటుసారాయో, గంజాయో, డ్రగ్సో తాగి వచ్చి ఛానల్ స్టూడియోలో కూర్చున్నట్లు మాట్లాడతావా? సచివాలయ ఉద్యోగుల్లో సగానికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఎంటెక్, పీజీలు, డబుల్ పీజీలు చేసిన అత్యున్నత విద్యావంతులు ఉన్నారు. వాళ్లంతా పోటీ పరీక్షలు రాసి ప్రతిభతో ఉద్యోగాలు సాధించారు. నీలాగా ఎవడి సంకో నాకి, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ రాలేదు. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న మీ ఛానల్ యజమాని సంస్కారమేంటో, ఈ వయసులో హోటళ్లలో మహిళలతో ఎలా ప్రవర్తిస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలైన పోరంబోకులు, గంజాయి బ్యాచ్ ఉండేది మీ ఛానల్‌లోనే. అబద్ధాలు, విషప్రచారాలే ఎల్లో మీడియా ఎజెండా.. పరీక్ష రాయకుండా ఏ ఒక్క అభ్యర్థి కూడా గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగం సాధించలేదు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను సైతం స్పెషల్ బ్రాంచ్ చేత ఎంక్వైరీలు చేయించి, శాప్ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే పకడ్బందీగా తొమ్మిది నెలల అనంతరం భర్తీ చేశాం. 2019 అక్టోబర్ 2 కల్లా నోటిఫికేషన్ పూర్తయి ఉద్యోగులంతా విధుల్లో చేరారు. మా పార్టీ నేత రోజా గారు 2022 ఏప్రిల్ 11న మంత్రి అయ్యారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 2021 ఆగస్టులో శాప్ చైర్మన్ అయ్యారు. వాళ్లు పదవుల్లోకి రాకముందే, ఉద్యోగులంతా ఏడాదిన్నర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత... ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి, రోజా పేర్లను వీటికి లింక్ చేస్తూ స్క్రిప్టులు చదవడానికి నీకు సిగ్గుండాలి.. దమ్ముంటే ఉద్యోగుల దగ్గరికెళ్లి గంజాయి బ్యాచ్ అనగలవా? సాంబశివరావు... నీకు కాస్తైనా పౌరుషం, రోషం ఉంటే, చంద్రబాబు పంపిన స్క్రిప్ట్ పక్కనపెట్టి జిల్లాల్లోని సచివాలయ ఉద్యోగుల దగ్గరకు వెళ్లి ‘మీరు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, పోరంబోకులు’ అని మొహం మీద అనగలవా? నీ కోటు చిరిగిపోకుండా హైదరాబాద్ చేరుకోగలవా చూద్దాం! మొన్ననే విజయవాడకు వచ్చి నిరసన తెలిపిన టీచర్లను, ఏపీఎన్జీవోలను, రెవెన్యూ ఉద్యోగులను కూడా గంజాయి బ్యాచ్, పోరంబోకులు అనే ధైర్యం నీకు ఉందా? ఏబీ వెంకటేశ్వరరావు, వసుంధర, రామచంద్ర లాంటి పౌర సంఘాల నేతలను కూడా పోరంబోకులు అనగలవా? ప్రభుత్వ తప్పులను ఎవరు నిలదీసినా వారిపై నేరస్తుల ముద్ర వేయడమే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు అలవాటుగా మారింది. ఉద్యోగులంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఆదినుంచీ కడుపుమంట. మహాత్మా గాంధీ జయంతి సాక్షిగా ఏర్పడి, 547 పౌరసేవలను ప్రజల గుమ్మం వద్దకే చేర్చిన గొప్ప వ్యవస్థ మా సచివాలయ వ్యవస్థ. కరోనా మహమ్మారి సమయంలో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడిన వేళ, ప్రాణాలను పణంగా పెట్టి ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల్లా సేవలందించిన ఉద్యోగులను కించపరచడం దుర్మార్గం. ఒకటో తేదీ రాగానే ఉదయం 7 గంటలకే నడుచుకుంటూ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్న చిరుద్యోగులపై మీకు ఇంత అక్కసు ఎందుకు? మొదటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగులన్నా, వారి జీతాలన్నా చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు విపరీతమైన కడుపుమంట. వైయస్సార్‌సీపీ అండగా ఉంటుంది – అన్యాయాన్ని సహించబోం.. ఈ నేపధ్యంలో 2022లో వేల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు వచ్చి నిరసన తెలిపినప్పుడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వారిని గౌరవించిందే తప్ప ఒక్కరిపై కూడా లాఠీచార్జ్ చేయలేదని, కేసులు పెట్టలేదని శివశంకర్ గుర్తుచేశారు. కానీ నేడు చిన్న ఉద్యోగులని చూడకుండా ఇప్పటికే 47 వేల మందిపై తప్పుడు కేసులు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు దుర్మార్గానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగుల పోరాటానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారికి అన్ని విధాలా అండగా నిలబడతామని పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు. త్వరలోనే అధికారంలోకి రాబోయే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించి, వారికి సముచిత గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.