తాడేపల్లి: సామాన్యుల జీవితాల్లోని వేదనను తన పద్యాల్లో ప్రతిబింబిస్తూ, సమాజంలో వేళ్లూనుకున్న వివక్ష, అన్యాయాలను నిర్భయంగా ప్రశ్నించిన మహాకవి గుర్రం జాషువా అని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మానవత్వాన్ని చాటి, తన రచనలతో సమాజాన్ని చైతన్యపరిచిన జాషువా సాహిత్యం తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సంపదగా నిలిచిందని తెలిపారు. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు వైయస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల వేదనను తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన జాషువా ఆలోచనలు, రచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.