పవన్‌ సినిమా హీరో అయితే..వైయస్‌ జగన్‌ రియల్‌ హీరో

పవన్‌ మొహనికి మేకప్‌ వేస్తే హీరో..తీసేస్తే జీరో

భీమవరంలో పవన్‌ గెలుపుకోసం సూర్యారావు డబ్బులు పంచలేదా?

2009లో పవన్‌ ప్రచారం చేసినా బొత్స గెలిచారు

విజయసాయిరెడ్డిపై పవన్‌ వ్యాఖ్యలు దుర్మార్గం

నాగవళి ఇసుకను దోచుకున్నది అచ్చెన్నాయుడు కాదా?

 అప్పుడు ప్రజారాజ్యాం పార్టీని టీడీపీ వాళ్లే నాశనం చేశారు

వైయస్‌ జగన్‌ను చూసి పవన్‌ నేర్చుకోవాలి

వైయస్‌ఆర్‌సీపీ ఆమంచి కృష్ణమోహన్‌

తాడేపల్లి: పవన్‌ కళ్యాణ్‌ సినిమా హీరో అయితే..ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రియల్‌ హీరో అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌ అభివర్ణించారు. పవన్‌ మొహానికి మేకప్‌ వేస్తేనే హీరో ..అది తీసేస్తే జీరో అన్నారు. వైయస్‌ జగన్‌ను 151 నియోజకవర్గాల ప్రజలు హీరోగా ఎన్నుకున్నారని తెలిపారు. నిన్న పవన్‌ కళ్యాణ్‌ విశాఖ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆరోజు ప్రజారాజ్యాన్ని నాశనం చేసింది టీడీపీనే అని, ఇప్పుడు అదే టీడీపీతో జనసేన కలుస్తుందని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డారని, జననేతను చూసి పవన్‌ కళ్యాణ్‌ నేర్చుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమంచి కృష్ణమోహన్‌ మీడియాతో మాట్లాడారు. నదుల వరదతోనే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఇసుక కొరతపై నిన్న విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ లాంగ్‌మార్చ్‌ నిర్వహించారని, వాస్తవంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాతావరణ శాఖ అధికారుల నివేదికలను బట్టి మన ప్రణాళికలను రూపొందించుకుంటామన్నారు.ఏపీకి నైరుతి రుతుపవనాలు జూన్‌కు రావని చెప్పినట్లు గుర్తు చేశారు.  

మనకు సాధారణ వర్షపాతం కంటే నాలుగు శాతం తక్కువగా ఉంటుదని శాతం  వాతావరణ శాఖ తెలిపినట్లు చెప్పారు.  అలాంటిది ఆగస్టు, సెప్టెంబర్‌లో 30 శాతం అధికంగా వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. వైయస్‌ జగన్‌ కొత్తగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత జూన్‌ నెలలో పదవీ బాధ్యతలు చేపట్టారన్నారు. జూన్‌, జులై, ఆగస్టు వరకు కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. వరదలు రావడం, ఐఎంబీ నివేదికలు తప్పుకావడంతో ఇసుక కొరత ఏర్పడిందన్నారు. గడిచిన 20 ఏళ్ల తరువాత ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే ప్రధమమన్నారు. వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందన్నారు. దీన్ని ఆధారం చేసుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. సమస్య తెలిసీ తెలియకుండా అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే పవన్‌ కళ్యాణ్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాగా వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయన్నారు. ప్రతిపక్షాల రాద్ధాంతం వల్లే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నిన్న పవన్‌ కళ్యాణ్‌ మీటింగ్‌కు రూ.4 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు ఇస్తే సరిపోతుందని పవన్‌ అంటున్నారన్నారు.

Read Also: పవన్‌ అజ్ఞాత వాసి కాదు..అజ్ఞాన వాసి 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల నిధిని వేరే పనులకు మళ్లించి వాడుకున్నారని, సాక్షాత్తు అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. తాత్కాలికంగా ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలనే విషయంపై పరిష్కార మార్గం పవన్‌ చెప్పలేకపోయారన్నారు.  కార్మికులకు నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గం చెప్పేవారన్నారు. పవన్‌ నిన్న మీటింగ్‌లో మంత్రి బొత్స, ఎంపీ విజయసాయిరెడ్డి గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విజయసాయిరెడ్డి 60 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిపై, దేశంలోనే అత్యున్నతమైన ఆడిటర్‌, చాలా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. ఆయనకు  ఒక్కటే కూతురు, ఆమెను కూడా అరవింద కంపెనీ యజమాని కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారన్నారు. నీవు మొహానికి మేకప్‌ వేసుకుంటే హీరో..మేకప్‌ తీసేస్తే జీరో అని అభివర్ణించారు. ఏమి వదిలేశావని పవన్‌ను ప్రశ్నించారు. చేతకాని ప్రతినిధ్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. భీమవరంలో నీ తరఫున సూర్యరావు డబ్బులు పంచింది వాస్తవం కాదా అన్నారు. నీవు సినిమాల్లో సంపాదించిన డబ్బులకు లెక్కలు చూపించావా అన్నారు. నీ సినిమాకు బ్లాక్‌ టికెట్లు అమ్మి సొమ్ము చేసుకుంది వాస్తవం కాదా అన్నారు. సమాజం గురించి, నీతి గురించి పవన్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

చిదంబరం అమిత్‌షాను జైల్లో పెడితే..మళ్లీ అమిత్‌షా చిదంబరాన్ని జైల్లో పెట్టారని వార్తలు వస్తున్నాయని, ఇదే చిదంబరం హాయంలో వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టింది వాస్తవం కాదా అన్నారు. చంద్రబాబుపై కేసులు లేవా అని నిలదీశారు. ఇలాంటి కేసులపై చర్చలపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. నీకు ఏముందని త్యాగం చేశావన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఒక ప్యాషన్‌తో వస్తారన్నారు. నిన్ను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఇబ్బందులపాలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పవన్‌ స్ట్రీప్ట్‌ చదివడం కూడా రాదన్నారు. నాదేళ్ల మనోహర్‌ లింగమనేని బంధువని, వారిని కాపాడేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని, నాదేళ్ల మనోహర్‌ స్ట్రీప్ట్‌ రాసిస్తే..రాష్ట్రంలో వేరే సమస్యలు లేవని లింగమనేని గురించి మాట్లాడుతావా అని నిలదీశారు. చంద్రబాబు నిర్మించిన అక్రమ సామ్రాజ్యాన్ని కచ్చితంగా కూల్చాల్సిందే అన్నారు. రాజధాని విషయంలో జీఎన్‌ రావుకు ఒక నివేదిక  ఇవ్వబోతున్నామని చెప్పారు. రాజధాని కోసం చంద్రబాబు సేకరించిన 33 వేల ఎకరాల్లో కేవలం 4 వేల ఎకరాలు మాత్రమే ఉపయోగించుకున్నారని, మిగతా భూములను చంద్రబాబు ఆయన మందీ మార్భలానికి రూపాయికి, అర్ధరూపాయకి కట్టబెట్టారని విమర్శించారు. భూమి తీసుకొని రైతులకు కౌలు కడుతున్నామన్నారు. ఒక వైపు ఆదాయం పోతుందని, మరోవైపు భూములను తన బినామీలకు కట్టబెట్టారన్నారు. ఇది క్రూరమైన ఆలోచన కాదా అన్నారు.

మీరు రాజకీయ పార్టీగా విజయం సాధించాలంటే ..నిన్ను ఉన్నతస్థాయిలో చూడాలనుకుంటున్నవర్గాల ఐడియాలజీకి భిన్నంగా వెళ్తున్నావని చెప్పారు. నిన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా నీలో మార్పు రాలేదన్నారు. వంగవీటి రంగాను విజయవాడ నడిరోడ్డుపై చంపితే..అదే ప్రాంతంలో చంద్రబాబుతో చెప్పులు లేకుండా రక్తపు మడుగులో నడుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిన్ను సమర్ధించే వర్గాలు హర్షిస్తాయా? అలాంటి రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు.  సిగ్గులేకుండా టీడీపీ ఒక్కటే వచ్చిందని, బీజేపీ, వామపక్షాలు నీ లాంగ్‌ మార్చ్‌కు వచ్చాయా అని ప్రశ్నించారు. నాగావళిలో ఉన్న  ఇసుకంతా అచ్చెన్నాయుడు దోచుకున్నారని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు నిన్ను అంతగా విమర్శిస్తే..ఆయన్ను పక్కనబెట్టుకొని మాట్లాడుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌..నీవు సినిమాల్లో హీరో అయితే..వైయస్‌ జగన్‌ ప్రజల్లో రియల్‌ హీరో అన్నారు.

వైయస్‌ జగన్‌పై నమ్మకంతోనే ప్రజలు 151 స్థానాల్లో గెలిపించి హీరోను చేశారన్నారు. వైయస్‌ జగన్‌ను చూసి పవన్‌ నేర్చుకోవాలన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ చనిపోతే..ఆయన్ను ఎంతగా ఇబ్బంది పెట్టారో, ఆయన అన్ని సౌఖ్యాలు వదిలేసి రోడ్డుపై ప్రజల కోసం తిరిగారని వివరించారు. నిజజీవితంలో హీరోయిజం ఉండాలన్నారు. నిర్మాతల నుంచి రూ. 50 కోట్లు తీసుకొని, ఐటీ లెక్కుల మాత్రం రూ.1 కోటికి చూపిస్తున్నారన్నారు. ఇది హీరోయిజమా అని ప్రశ్నించారు. పవన్‌కు దమ్ముంటే బ్లాక్‌లో టికెట్లు అమ్మేది ఆపాలని, ట్యాక్స్‌లు సక్రమంగా కట్టాలన్నారు. సినిమా కార్మికుల నోట్లు మట్టి కొడుతున్నారని దుయ్యబట్టారు.  టీడీపీ పాలనలో  ఒక్క ఉద్యమమైనా చేశావా? అప్పుడు ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లావా అని నిలదీశారు. ఇసుక కొరతను ప్రభుత్వం తీర్చేందుకు కృషి చేస్తోందని, ఇందుకోసమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఇసుక తీసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. వైయస్‌ జగన్‌కు నీలాంటి వాళ్లతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

Read Also: పవన్‌ అజ్ఞాత వాసి కాదు..అజ్ఞాన వాసి 

Back to Top