పవన్‌ అజ్ఞాత వాసి కాదు..అజ్ఞాన వాసి 

2 కిలోమీటర్లు నడవలేని పవన్‌కు సీఎం గురించి మాట్లాడే అర్హత లేదు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ 

విశాఖ: పవన్‌ అజ్ఞత వాసి కాదు..అజ్ఞాన వాసి అని బయటపడిందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అభివర్ణించారు. లాంగ్‌ మార్చ్‌తో పవన్‌ అజ్ఞానం  పేర్కొన్నారు. 
చంద్రబాబు ట్రాప్‌లో పవన్‌ కళ్యాణ్‌ పడ్డారని విమర్శించారు. ఎన్నికల్లో పవన్‌ను ప్రజలు తిరస్కరించారని గుర్తించుకోవాలన్నారు. ఎందుకు తిరస్కరించారో కనీసం పవన్‌ సమీక్షించకున్నారా అని ప్రశ్నించారు. పవన్‌ ఇంకా సినిమా భ్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిన్న సభలో పవన్‌ మాట్లాడిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. పవన్‌ వ్యాఖ్యల ద్వారా అజ్ఞానం, అపరిపక్వత కనిస్తోందని విమర్శించారు. టీడీపీతో పవన్‌ కలిస్తే మాకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.చంద్రబాబుతో పవన్‌కు చీకటి ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు.టీడీపీతో పవన్‌కు లాలూచీ ఉందనే జనసేనను ఓడించారని గుర్తు చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడైనా గెలిచారా అని నిలదీశారు. 2 కిలోమీటర్లు నడవలేని పవన్‌కు సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు లేకుండా పవన్‌ సభ పెట్టలేరా అని ప్రశ్నించారు. 

Read Also: బాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు

Back to Top