జెడ్పీ చైర్మ‌న్ల‌కు గ‌న్‌మెన్ల‌ను కేటాయించాలి

వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి

కృష్ణా జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ ఉప్పల హారికకు ప‌రామ‌ర్శ‌

 కృష్ణా జిల్లా: జీవో నెంబర్-431 (Date:15-11-1997) ప్రకారం జడ్పీ చైర్మన్లకి త‌క్ష‌ణ‌మే గన్‌మెన్ల‌ను  కేటాయించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం కృష్ణా జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స్ ఉప్పాల హారిక‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ర‌వీంద్రారెడ్డి మాట్లాడుతూ..`స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది.  నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ప్రజా సమస్యల గురించి చర్చించకుండా విఫలమైన పవన్ సినిమా గురించి చర్చలు ఏమిటి.?  ఈ ప్రభుత్వానికి రెండే కళ్ళు దోచుకోవడం-దాడులు చేయడం. వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీద దాడులు/అక్రమ అరెస్టులు/ నిర్బంధాలే ఈ ప్రభుత్వం ఎజెండా . అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే సామెత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు అనే విధంగా ఈ కూటమి పాలన లో జరిగిన ఈ సంఘటన నిరూపిస్తుంది అని తెలియపరిచిన సంఘటన ఇది...

ఉప్పాల హారిక రాము దంపతులను పరామర్శ‌

పెడన మండలం కూడూరు గ్రామంలో కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద ఇటీవల జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకుని ఖండిస్తూ చైర్ పర్సన్ ను పరామర్శించి మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస  రవీంద్రా రెడ్డి ,రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సహాయ కార్యదర్శి  ఈపూరి రమేష్(ఆదం) ,సత్య సాయి జిల్లా పంచాయతీ రాజ్ రాష్ట్ర వింగ్ ప్రధాన కార్యదర్శి  అప్పిరెడ్డిగారి సురేష్ రెడ్డి , కృష్ణాజిల్లా వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్  అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు ఉన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రథమ పౌరురాలుకే  ఇలా జరిగిందంటే సామాన్య మహిళలకు  ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఎటువంటి  న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తూ భౌతిక దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చిల్లీగవ కూడా పంచాయతీరాజ్కు విడుదల చేయకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం నాకేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినా నీవు.. నీ సినిమాకి ఇచ్చిన విలువ కూడా నీ సొంత శాఖకు ఇవ్వకపోవడం నీకు ప్రజల పట్ల ఉన్న ప్రజాప్రతినిధుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుస్తోందని అన్నారు.  

Back to Top