కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి 

ఆత్మ‌కూరులో `రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో` పోస్టర్ ఆవిష్కరణ

నెల్లూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, బిజెపి, జనసేన పార్టీల నాయకులు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వ మోసాల‌ను పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివ‌రించాల‌ని సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో `రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  విక్ర‌మ్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారోలోకి వచ్చేందుకు వందల సంఖ్యలో హామీలిచ్చారని, బాబు ష్యూరిటి- భవిష్యత్తు గ్యారెంటి అని ప్రజలకు బాండ్లు ఇచ్చి మోసం చేశారన్నారు. 

గతంలో లాగానే ప్రస్తుతం కూడా వాటిని అమలు చేయకుండా ఎప్పటి లాగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తల్లికి వందనం పథకం నగదు అరకొరగా బ్యాంకుల్లో వేసి పూర్తి చేశామని ప్రచారం చేసుకుంటున్నట్లు విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలిచేందుకు తెచ్చిన రైతు భరోసా పథకాన్ని ప్రతి సంవత్సరం అందచేశారని, కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని పేర్కొన్నారు.

మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఎన్నో పథకాలు ప్రస్తుతం అమలు కావడం లేదని, ప్రజలకు ఈ విషయాలన్నింటిని ప్రతి నాయకుడు, కార్యకర్త రీకాలింగ్ చంద్రబాబు మెనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వివరించి క్యూఆర్ కోడ్ లో స్కాన్ చేయించి వారి అభిప్రాయాలను నమోదు చేయించాలని సూచించారు.  

నెల్లూరు నుంచే తిరుగుబాటు ప్రారంభం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలను అధికంగా అమలు చేస్తున్నారని, అలాంటి వాటిపై ప్రజలతో కలసి మన జిల్లా నుంచే తిరుగుబాటు  ప్రారంభమవుతుందని విక్ర‌మ్‌రెడ్డి హెచ్చ‌రించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజంపేట ఎంపీ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్ రెడ్డి అరెస్ట్ లు కూటమి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మున్సిపల్ విభాగ కన్వీనర్ చెరుకూరు కామాక్షయ్యనాయుడు, పట్టణ ఉపాధ్యక్షుడు ఆండ్రా సుబ్బారెడ్డి, నాయకులు సురేంద్రరెడ్డి, నారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, కల్పనారెడ్డి, రహీం, కలాం, చిల్లూరు వెంకటేశ్వర్లు, ఎం జనార్థన్ రెడ్డి,   తదితరులు పాల్గొన్నారు.

Back to Top