మండ‌ల స్థాయిలో `రీ కాలింగ్ చంద్ర‌బాబు మ్యానిఫెస్టో` గ్రాండ్ స‌క్సెస్‌

ఇదే ఉత్సాహాన్ని గ్రామ స్థాయిలో కొన‌సాగించండి 

పార్టీ కమిటీల నియామకాలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపు

టెలీ కాన్ఫ‌రెన్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేత‌ల‌కు స‌జ్జ‌ల దిశానిర్దేశం

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు బాబు ష్యూరిటీ -మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) చేప‌ట్టిన కార్యక్రమం మండల స్ధాయిలో గ్రాండ్‌ సక్సెస్ అయ్యింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ కార్య‌క్ర‌మాన్ని గ్రామ స్థాయిలో కూడా కొన‌సాగించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్‌), రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్‌), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాలను సమన్వయం చేసే స్టేట్‌ సెక్రటరీలు, స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శుక్ర‌వారం టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. 

టెలికాన్ఫరెన్స్‌లో   సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే...

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది, అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చింది. టీడీపీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారు. మనం చేస్తున్న కార్యక్రమానికి ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది, కానీ టీడీపీ కార్యక్రమానికి ఎలాంటి స్పందన లేదు. తల్లికి వందనం అన్నారు లక్షలమందికి ఎగ్గొట్టారు, పైగా అరకొరగా వేశారు, ఆడబిడ్డ నిధి లేదన్న ప్రకటన కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చింది. మన అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌ గారు మన కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టడంతో పాటు ప్రజల్లోకి వెళుతూ వారిలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా మన కార్యక్రమం సాగుతోంది. లేని లిక్కర్‌ స్కామ్‌ పేరుతో అరెస్ట్ లు చేస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనం అంతా గట్టిగా నిలబడుతుండడం వల్ల మనల్ని కదిలించలేం అని కూటమి పార్టీలకు అర్ధమైంది. టీడీపీ కక్ష్యసాధింపు చర్యలు మన నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీయలేవు

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం మండలాల్లో ఇప్పటివరకు దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో కూడా ప్రారంభమైంది. ఈ నెలాఖరికల్లా మండల స్ధాయి పూర్తికావాలి. మండలస్ధాయిలో పూర్తిచేసిన వారు గ్రామస్ధాయిలోకి వెళ్ళిపోయారు. నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేద్దాం. జాప్యం జరగకూడదు. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. అవసరాన్ని బట్టి మండలస్ధాయిలో పార్టీ పదవుల నియామకానికి వెసులుబాటు కల్పించాం. కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి. పార్టీ కేంద్రకార్యాలయం నుంచి కూడా కోఆర్డినేషన్‌ ఉంటుంది. గ్రామస్ధాయి నుంచి పార్టీ క్యాడర్‌కు కనెక్టివిటీ పెరగాలి. ఉత్సాహంగా పార్టీలో పనిచేసేవారిని గుర్తించి వారికి ప్రాధాన్యతనివ్వాలి. అనుబంధ విభాగాల నుంచి కమిటీలు త్వరగా పూర్తిచేయాలి. అన్ని కమిటీల నుంచి డేటా ప్రొఫైలింగ్‌ చేసి నెట్‌ వర్క్‌ పెంచుకుందాం. కమిటీలలో పనిచేసే వారు సమర్ధవంతంగా పనిచేసేలా ఉండాలి. అనుబంధ విభాగాల కమిటీలు కూడా త్వరగా పూర్తయితే పార్టీ కార్యక్రమాలు మరింతగా విజయవంతం అవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు.

Back to Top