ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కోర్టులు అడ్డు 

వైయ‌స్ఆర్‌‌ సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌

 న్యూఢిల్లీ : ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కోర్టులు అడ్డుపడుతున్నాయ‌ని వైయ‌స్ఆర్‌‌ సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్‌ చేసుకున్నారని, 40 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని విమ‌ర్శించారు. ఆ కుంభకోణంపై వెంటనే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం భూములు పొందారు.

 గతంలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలను ముగ్గుర్ని తీసుకుంటే ఇప్పుడు టీడీపీకి ముగ్గురే మిగిలారు. రఘురామకృష్ణం రాజును తీసుకున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో రాష్ట్రమంతా మాకు మంచి మర్యాద ఉంది. వచ్చే ఎన్నికల్లో 151 మించి సీట్లు గెలుచుకుంటాం. ప్రతి మతం, కులం కోసం మేము పోరాడుతామ‌ని కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌ అన్నారు.

 

Back to Top