సీఎం వైయస్‌ జగన్‌ మాట రామబాణం

ఇచ్చిన మాట కచ్చితంగా అమలు జరుగుతుంది

దిశ చట్టం తీసుకువచ్చిన జగనన్నకు ధన్యవాదాలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
 

 

అసెంబ్లీ: మహిళా భద్రత కోసం మంచి బిల్లు తీసుకువచ్చిన సీఎం వైయస్‌ జగన్‌ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. అసెంబ్లీలో దిశ బిల్లుపై ఆమె మాట్లాడుతూ.. మహిళలను ఒక దేవతగా గౌరవించే దేశం మనది. ఇటువంటి పరిస్థితి.. ఎక్కడైతే ఆడవారు గౌరవింపబడతారో.. అక్కడ దేవతలు పూజింపబడతారనే నానుడి ఉంది. ఇటువంటి దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆడవాళ్లకు ఎటువంటి గౌరవం, భద్రత లేదని చెప్పేందుకు మన అసెంబ్లీ సాక్షం. ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆడవారిపై జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నిస్తే.. ఆమెను సభ నుంచి ఏరకంగా బయటకు పంపించారో ప్రజలంతా చూశారు. అదేవిధంగా మహిళా ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళితే.. గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పబ్లిక్‌గా మహిళా అధికారిని జుట్టుపట్టుకొని ఈడ్చికొట్టినా అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకుండా వాళ్లకు ఏరకంగా కొమ్ముకాశారో.. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా చూశారు. ఇదే సభలో చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చెప్పడానికి సభ్యత, సంస్కారం అడ్డువస్తున్నాయి. ఆడపిల్ల కనిపిస్తే ఏం చేయాలి.. ఎలా చేయాలనేది అంతా చూశారు. ఇటువంటి వాళ్లను నాయకులుగా ఎన్నుకున్నందుకు అప్పట్లో అందరూ సిగ్గుపడ్డారు.

చనిపోయిన తరువాత తలకొరివిపెట్టి పున్నామనరకం నుంచి తప్పించేవాడు కొడుకు అయితే.. బతికి ఉండగా పట్టెడు అన్నం పెట్టేది కూతురు కాబట్టి కూతురుకు కూడా కొడుకుతో పాటు విద్య నేర్పించాలని, ఆ అవకాశం, స్వేచ్ఛను ఇవ్వాలని గత కొంతకాలంగా ఆడపిల్లలను బయటకు పంపిస్తూ.. చదివించి నా బిడ్డ అని చెప్పుకుని గర్వపడే స్థితిలో.. గత ప్రభుత్వం హయాంలో ఆడవాళ్లపై జరిగిన అఘాయిత్యాలు చూసి ప్రతి తల్లిదండ్రులు భయపడ్డారు. మా పిల్ల బయటకు వెళ్తే మళ్లీ సక్రమంగా ఇంటికి వస్తుందా..? ఏ గ్యాంపు రేపుకు గురవుతుందో..? కనీసం చంపేసిన తరువాత అయినా ఆ శవం అయినా మాకు దొరుకుతుందా.. మాంసం ముద్దగా ఇంటికి వస్తుందోనని తల్లిదండ్రులు భయపడి ఆడవాళ్లను భయంతో బయటకు రానివ్వడం లేదు. ఇప్పటి వరకు ఆడవారిపై జరిగిన అత్యాచారాలు ఎక్కువగా మద్యం మత్తులోనే జరిగాయి. 10 నెలల పసికందు దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు అత్యాచారాలకు గురయ్యారు. వీటన్నింటికీ కారణం ప్రతీ సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చంద్రబాబు ఆయన పార్టీ కార్యకర్తలను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నం.. ఆడపిల్ల భద్రత కోసం చేసి ఉంటే క్రైంరేటు పెరిగి ఉండేది కాదు..

2015–17 వరకు చంద్రబాబు పాలనలో చూసుకుంటే ఆడవారిపై జరిగిన అత్యాచారాలు 50,238 కేసులు నమోదయ్యాయి. బిహార్‌ రాష్ట్రంలోనే 42015 జరిగితే.. మన రాష్ట్రంలో 2015 నుంచి 17 వరకు మూడేళ్లలో బిహార్‌ను మించిపోయారు. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో అధికారికంగా ఇచ్చిన రిపోర్టు. ఆడవారిపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని చంద్రబాబు ఏరోజూ అనుకోలేదు.

Read Also: వైయస్‌ జగన్‌ ఒక కారణజన్ముడు

దిశ సంఘటన తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తంలో ప్రభావం చూపింది. ఇటువంటి వాటిపై కఠిన చట్టాలు రావాలని ఆడవారంతా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. నిర్భయ, దిశ కాకుండా తెలియనివారు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ కాపాడేందుకు ఒక పటిష్ట చట్టం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏదైనా మాట ఇచ్చారంటే.. చేసి చూపిస్తారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఇచ్చిన హామీలు, పాదయాత్రలో చెప్పినవి కూడా అమలు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఒక మాట ఇచ్చారంటే.. అది రామబాణంలా వెనక్కు రాదు.. కచ్చితంగా అమలు జరుగుతుంది. మహిళల భద్రత కోసం సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన దిశ యాక్టు నూటికి నూరుశాతం అమలవుతుందని, తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటకు పంపిస్తారు.

దిశ యాక్టు గురించి అన్ని రకాలుగా ఆలోచించి, క్షుణ్ణంగా చర్చించి, ప్రతీ పాయింట్‌ పరిశీలించిన తరువాత ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో మళ్లీ ఆడవాళ్లు ఒకప్పటిలా బయటకు వచ్చి ధైర్యంగా తిరగగలరు. సీఎం వైయస్‌ జగన్‌ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ ఇచ్చారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎంలుగా మహిళలకు అవకాశం కల్పించారు.

చంద్రబాబుకు ఆడవారిపై ఎంత గౌరవం ఉందో చెప్పడానికి ఈ ఐదు రోజుల సభలో ఉదాహరణ చెప్పవచ్చు. సభా ప్రారంభం రోజు సోమవారం ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై సభ జరుగుతుంటే చంద్రబాబు ఉల్లిపాయల కోసం గొడవ చేశారు. పంట వేసేటప్పుడు వర్షాలు లేవు.. పంట తీసే సమయానికి వర్షాలు వచ్చాయి.. రేటు ఎక్కవ అయింది. ఇంకా రెండు నెలలు పోతే  కిలో రూ.10కి లభిస్తాయి. చంద్రబాబుకు రూ.10 ఉల్లికి ఉన్న విలువ ఆడవారికి ఇవ్వలేకపోతున్నారు. దీన్ని బట్టి మరోసారి తెలుగుదేశం వాళ్లకు ఆడపిల్లలు అంటే ఎంత విలువ ఉందో అర్థం అవుతుందని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు.

Read Also: వైయస్‌ జగన్‌ ఒక కారణజన్ముడు

తాజా వీడియోలు

Back to Top