ప్రజల పక్షాన వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం

ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ నేతలపై దాడులు దుర్మార్గం

అనంతపురంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన*

కూటమి పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు

మేం లాకప్‌ అంటే వాళ్లు మేకప్‌ అంటున్నారు..!

తాడిపత్రిలో శాంతియుత నిరసన తెలుపుతామంటే మాపై కేసులా?

నీయమ్మ..నా కొడకల్లారా అంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలుండవా?*

అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోకతప్పదు

వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ మండిపాటు

అనంతపురం : రాష్ట్రంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా మొదటగా గుర్తుకు వచ్చేది వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని, బాధితులకు అండగా పోరాటం చేసేది వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని వైసీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలు, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఆదివారం అనంతపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాకే చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి వద్ద రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారన్నారు. అదే తరహాలో తన ఆర్థిక లబ్ధి కోసం రాజధాని పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. గతంలోనే రాజధాని కోసం 30 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో మరో 50 వేల ఎకరాలను తీసుకుంటున్నారని తెలిపారు. భూములు ఇవ్వని రైతులను బెదిరిస్తున్నారని  చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఉన్న కొండవీటి వాగు నుంచి రైతుల భూముల్లోకి నీటిని పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై బాధిత రైతులు అధికారులను సంప్రదించినా న్యాయం జరగడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులు వైఎస్‌ జగన్‌ను కలిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో రాజధాని రైతు పరిరక్షణ కమిటీ వేశారన్నారు. రైతుల ఆహ్వానం మేరకు శనివారం పొలాలను పరిశీలించడానికి వెళ్లినా వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరమా? అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు క్షిణించాయని, రాష్ట్ర హోం మంత్రిని ప్రశ్నిస్తే ఎస్సీ కార్డును బయటకు తీస్తున్నారని విమర్శించారు. ఇటీవల దళిత యువకుడు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సాయికృష్ణ అనే యువకుడి లాకప్‌ డెత్‌ గురించి తాము మాట్లాడితే వాళ్లు మాత్రం మేకప్‌ గురించి మాట్లాడి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ శాంతియుత నిరసన తెలిపితే తమపై కేసులు పెట్టారని తెలియజేశారు. ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చగొడుతూ తాడిపత్రిలోని పోలీస్‌స్టేషన్‌ వద్దే స్నానం చేస్తే కనీసం కేసు పెట్టలేదన్నారు. మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని నీయమ్మ..నా కొడకల్లారా అంటున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పోలీసులతో ఏదైనా చేయచ్చని అనుకోవద్దని, ఈ రోజు విర్రవీగితే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనునిత్యం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్ ,  వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, నగర ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నాయకులు హరి, అబ్బాస్, మైను, మసూద్, కోడూరు రాము, సుబ్బారావు, బోయ హర్ష, గుజ్జల శివయ్య, రోహిత్, విష్ణు, సాయికుమార్, సాకే కుమార్, హిమకర్‌ సాయి, ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top